Showing posts with label kavitha. Show all posts
Showing posts with label kavitha. Show all posts

Tuesday, February 21, 2012

purusha prathibha పురుష ప్రతిభ

purusha prathibha పురుష ప్రతిభ

purusha prathibha

పురుష ప్రతిభ

విశ్వం , ఇది ఒక దృశ్య కావ్యం
వ్యక్తావ్యక్తల సంమిశ్రనం

కల్పనా వాస్తవికలతో సమ్మోహనం
ఇది నవరస భరితం , సకల కళా శోభితం

ప్రతిసన్నివేశం నవ నవోన్మేశం
క్షణం క్షణం జీవితం ఉత్కన్ట్ట జనితం

నేపథ్యం అరణ్య నదీ నద పర్వత సాగరమయం
ఆకాశ సూర్య చంద్ర తారా మండలాలతో అలంకృతం

వైవిధ్య వైరుధ్య విపరీతాలతో రీతి సవ్యతల సఖ్యం
ఇదొక జీవ నిర్జీవ ప్రతిమా నాటకం పురుష ప్రతిభా పాటవం

ఇందులో నీవొక ప్రేక్షకుడవే కాదు ఒక పాత్ర ధారివి కూడా
దాని సూత్ర ధారివి కూడా

నీ ఈ పాత్ర అతనిదొక చిరు అవతారం
జగన్నాటక సూత్ర దారివిగా ఎదగడానికి నీకిచ్చిన సదవకాశం

సాధించు రాణించు జయించు జగమేలు
మెలమెల్లగా చల్లగా తీయగా హాయిగా

the glory of supreme

universe is a visual poetic treat
a mix of visibles and invisibles, neat

full with 9 moods, bedecked with all arts
it is bewitching with fiction and facts

every scene ever a flow of novelty
moment to moment , suspence, a running commentary

back drop rich with jungles, rivers, rivulets, mountains, oceans
well beautified with sky sun moon stars galaxies

variety, contradictions ,odds in friendship with harmony and order
this is a drama with living and nonliving dolls, the glory of supreme designer

in this you are not only a spectator but also an actor,
and more its director

this your role is his a small incarnation
to enable you to grow into the stature of director of this drama of universe

accomplish, shine, win, and rule the universe
gradually, coolly, sweetly, blissfully

Saturday, February 18, 2012

akshar seekhlo అక్షరం నేర్చుకో

akshar seekhlo అక్షరం నేర్చుకో


అక్షరం నేర్చుకో
లక్ష్యం సాధించుకో
అవకాశాలు సృష్టించుకో
అవధులు దాటి సాగి పో
జ్యోతితో జీవనం వెలిగించు
నీతి తో ఆనందం ఆరగించు
akshar seekhlo
lakshya ko saadhlo
avakaashe srushti karlo
avadhiyo paarkar aage badho
jyothi se jeevan me ujhala laavo
neethi se aanand bhogo

veena smiles ఒక వీణ నను చూసి నవ్వింది

veena smiles ఒక వీణ నను చూసి నవ్వింది

 veena smiles

ఒక వీణ నను చూసి నవ్వింది


తనను గెలుచుకొమ్మంది

వెల ఇచ్చి కొని కాదు

పగుల గొట్టి కాదు

తన వ్యక్తిత్వం పూర్తిగా ప్రస్ఫుటించేలా
వాయించ మంది
అందుకై ముందు, నామీద నాకు ఆధిక్యం

సంపాదించ మంది

a veena looking at me, smiles, she tells me
''come on , win me , overpower me, ''

not by purchasing , paying a price
not by breaking into many a piece,

but by playing, bringing out in totality
her personality

for this she asks me to achieve
mastery over my self first

my technic నా రీతి

my technic నా రీతి


my technic నా రీతి


చూపుతో విశ్వాన్ని కవ్విన్చుచున్నాను
మాట తో జీవితాన్ని జాగృతం చేస్తున్నాను
పాటతో ప్రపంచాన్ని పులకింప జేస్తున్నాను
ఆటతో అందరినీ ఆనందింప జేస్తున్నాను
మూగ నోముతో కళ్ళు
మూసుకొని కదలక మెదలక
జగత్తును నడిపిస్తున్నాను,
దాని ప్రభువై ఏలుతున్నాను
my technic
by my glance, i am provoking the universe
by my word, awakening the life
by my song, tickling the world
by my play, making all joyful
in vow of silence,
eyes closed, me moving not a bit
i am running the universe
being the lord over it

vaakkulu rukkulu వాక్కులు రుక్కులు

vaakkulu rukkulu వాక్కులు రుక్కులు


vaakkulu rukkulu వాక్కులు రుక్కులు

వాక్కులు రుక్కులు అయిన వేళ
కవిత పొంగుతుంది
సత్యం తో తొనికిసలాడుతుంది


vaakkulu rukkulu ayina vela....

kavitha ponguthundi
sathyam tho thonikisalaaduthundi

when vaak becomes ruk [vedic richa]
kavitha bubbles out
dancing merrily with shining truth

Honesty=thrikarana shudhi=alignment of life with law of nature=unity of thought talk walk

can happen when transcendental consciousness grows in mind and body in advanced stage of sadhana,
superficial attempts ok, but real is possible as a spontaneos blossomof viertues in the life, infallibly, effortlessly.
then vakshudhi is another manifestation,

vaakkulu rukkulu ayina vela....
kavitha ponguthundi
sathyam tho thonikisalaaduthundi

with nature ఆకులో ఆకునై

with nature ఆకులో ఆకునై


ఆకులో ఆకునై పూవులో పూవునై

ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ యడవి దాగిపోనా
ఎట్లైనా
నిచటనే యాగిపోనా?

గల గలని వీచు చిరుగాలిలో కెరటమై
జల జలని పారు సెలపాటలో తేటనై
ఈ యడవి దాగిపోనా
ఎట్లైనా
నిచటనే యాగిపోనా?
పగడాల చిగురాకు తెరచాటు తేటినై
పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై
ఈ యడవి దాగిపోనా
ఎట్లైనా
నిచటనే యాగిపోనా?
తరు లెక్కి యల నీలి గిరినెక్కి మెలమెల్ల
చద లెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఈ యడవి దాగిపోనా
ఎట్లైనా
నిచటనే యాగిపోనా?
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ కరణి వెర్రినై యేకతమా తిరుగాడ
ఈ యడవి దాగిపోనా
ఎట్లైనా
నిచటనే యాగిపోనా

“మేఘసందేశం” చిత్రం నుంచి

i like this
individuality is melting into universality
flow of heart free, innocent,
it takes me to another world
i want to read this again and again and flow along with the poet like a stream, fly like a bird , or stay like a tree, fully happy and in the company of the nature around